దూసుకువస్తున్న సింగం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతోపాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తన్న తాజా చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సుర ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ- ‘ఈ చిత్రానికి తమిళంతోపాటు తెలుగులో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందన్న నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్ ఈనెల 20తో పూర్తయ్యింది. దీంతో టాకీపార్ట్ పూర్తయ్యింది. బ్యాలెన్స్‌గా వున్న ఒక పాటను సూర్య, అనుష్కలపై విదేశాల్లో త్వరలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. దీపావళికి టీజర్‌ను, నవంబర్‌లో ఆడియోను విడుదలచేసి డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. తెలుగు నేటివిటీకి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి’ అని చెప్పారు.