మన్యం పులి మోహన్‌లాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ సినిమాతో తెలుగులోనూ సూఫర్‌హిట్ అందుకున్న మోహన్‌లాల్ దసరా కానుకగా ‘పులి మురుగన్’ చిత్రం త్వరలోనే తెలుగు నాట కూడా సందడి చేయనుంది. తెలుగులో ‘మన్యం పులి’ పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్‌లో ‘పులిమురుగన్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ‘పులి మురుగన్’ చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మలయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే ‘మన్యంపులి’గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు:వైశాఖ, కథ:ఉదయకృష్ణ, సంగీతం:గోపీసుందర్, కెమెరా:షాజీకుమార్.