సంక్రాంతికే వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవారి మహాభక్తుడైన హాథీరామ్ బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటకే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. కీరవాణి సంగీత నేపథ్యంలో పాటల రికార్డింగ్ కూడా పూర్తికావచ్చింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సీనియర్ హీరోల సినిమాలన్నీ వరుసగా ఈ సంక్రాంతికి పోటీపడడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘చిరంజీవి ఖైదీ నెం.150’ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇక నాగార్జున కూడా పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్ వర్క్ తప్ప షూటింగ్ చాలావరకూ పూర్తయిందట.