అమరవీరులకు పాటల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ అమరవీరుల స్మారకదినోత్సవం సందర్భంగా సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర ‘పోలీస్ పోలీస్’ ఆడియో ఆల్బంను రూపొందించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ హోం శాఖామంత్రి నాయిని నరసింహారెడ్డి సీడీలను విడుదల చేశారు. అనంతరం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ- ‘నేను గత 20 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా. పోలీసుల కష్టసుఖాలు నాకు బాగా తెలుసు. నా వ్యక్తిగత అనుభవాలతో ఇందులో రెండు పాటల్ని నేనే ఆలపించాను.
అలాగే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులపై మూడు పాటలుంటాయి. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేలా ఈ పాటలు వున్నాయి. పోలీసులపై గౌరవ మర్యాదలు పెంచేలా పాటల్ని రూపొందించాను.
ఇప్పటివరకు 12 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. రెండు సినిమాలను రూపొందించాను. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీడీని విడుదల చేసిన హోంమంత్రిగారికి ధన్యవాదాలు. ఈ సీడీని పోలీసు అమరవీరులకు అంకితమిస్తున్నాను’ అని అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- పోలీసు అమరవీరులకు అంకితమిస్తూ ఈ ఆడియోను విడుదల చేసినందుకు సంగీత దర్శకుడు రమేష్‌ను, సాయి వెంకట్‌ను అభినందిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, అనుపమారెడ్డి, రామకృష్ణ, బాలాజీ, అననయ్య తదితరులు పాల్గొన్నారు.