కేశవ రివెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వామిరారా’తో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్, దర్శకుడు సుధీర్‌వర్మల కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ- ‘హుషారైన ఓ కుర్రాడు ఎవరిపై పగపట్టాడు? అసలు పగ, ప్రతీకారాలంటూ ఎందుకు తిరుగుతున్నాడనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. త్వరలోనే రెండవ షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. నిఖిల్-సుధీర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా మంచి హిట్‌గా నిలుస్తుంది’ అన్నారు. దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ- ‘ఈ చిత్రంలో నిఖిల్ కొత్తగా కన్పిస్తాడు. రివెంజ్ డ్రామాతోపాటు ప్రేమకథ ఆసక్తికరంగా సాగుతుంది. షూటింగ్ మొత్తం కాకినాడనుంచి విశాఖపట్నం వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో జరుపుతాం. పెళ్లిచూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇషా కొప్పీకర్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అన్నారు.