ఎంతవరకు ఈ ప్రేమ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగం ఫేం జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో ‘కావలైవేండాం’ తమిళ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈప్రేమ’ పేరుతో అనువదిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత డి.వెంకటేష వివరాలు తెలియజేస్తూ- పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటలని 27న విడుదల చేస్తున్నాం. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జీవా, గ్లామర్ భామ కాజల్‌ల కలయికలో రూపొందిన ఈ సినిమా తమిళంలో భారీ అంచనాలను ఏర్పరచుకుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ పాటలు బాగా వచ్చాయి. తమిళంలో ఇప్పటికే పాటలు మంచి విజయాన్ని సాధించాయి. మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:టి.ఎస్.సురేష్, కెమెరా:అభినందన్ రామానుజం, సంగీతం:లియోన్ జేమ్స్, నిర్మాత:డి.వెంకటేష్, దర్శకత్వం:డి.కె.