తెరపైకి కెసిఆర్ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ జీవితం తెరకెక్కనుంది. దర్శకుడు మధుర శ్రీ్ధర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీ్ధర్‌రెడ్డి తెలుపుతూ- ‘కెసిఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా మారాక దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధోరణిలో చూడడం మొదలుపెట్టింది. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు చూసిన ఈ సంఘటనలు నాలో వున్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిదురపోనీయలేదు. ఆ క్రమంలో పరిశోధనలు చేసి తెలంగాణ, సమైక్యాంధ్ర ఉధ్యమకారులను విడివిడిగా కలిశాను. కొందరి మాటల ద్వారా ఎన్టీఆర్, చంద్రబాబు, సోనియా, చిరంజీవి, లగడపాటి, వెంకయ్య, అద్వానీ, పవన్‌కళ్యాణ్ తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను. జూన్ 2, 2017న షూటింగ్ మొదలుపెట్టి 2018 ఫిబ్రవరి 17న కెసిఆర్ పుట్టినరోజున చిత్రాన్ని విడుదల చేస్తా’ అని అన్నారు.