అలాంటిదేం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గ క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ శ్రీయాకు ఈమధ్య క్రేజ్ బాగా తగ్గింది. దాంతో సినిమాలూ తగ్గాయి. వస్తున్న అడపా దడపా అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ఈ భామ, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు హిందీలో కూడా ఓ సినిమాకు కమిట్ అయిన శ్రీయ, కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వెయిన్ బ్రేవోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌లో వుండగా మీడియా కంట పడింది. దాంతో వీరి వ్యవహారంపై కథనాలు జోరందుకున్నాయి. బ్రేవోతో శ్రీయ ప్రేమయాణం సాగిస్తోందని, ఇద్దరూ కలిసి షికార్లు కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై సైలెంట్‌గా వున్న ఈ భామ ఈవిషయంపై నోరు తెరిచింది. తమమధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తాము మంచి స్నేహితులమని, చాలా రోజుల తరువాత కలిసి లంచ్ చేశామని చెబుతూనే ఇదంతా మీడియా సృష్టించిందని చెప్పింది. మొత్తానికి శ్రీయ వ్యవహారంపై బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.