రెజీనా.. మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్న రెజీనా గట్టి షాకే ఇచ్చింది. తన ట్విట్టర్‌లో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో ఒకటి పోస్ట్ చేసి సంచలనం రేపింది. ఫొటో చూసినవారందరూ రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా అంటూ షాకయ్యారు. పైగా వెడ్డింగ్ బెల్స్.. మీ ఆశీస్సులు అందించండి అంటూ తన ఫొటోని పెట్టింది. ఈ ట్వీట్ చూసినవారందరూ షాకై చేతిలో ఇన్ని సినిమాలు వున్న రెజీనా అప్పుడే పెళ్లిచేసుకోవడమేంటా అని షాకయ్యారు. మరికొందరేమో కావాలనే ఇలా పెట్టిందా లేక సినిమా ప్రమోషన్ కోసమా అని డైలమాలో పడ్డారు. మంచు మనోజ్ అయితే ఏకంగా కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఈ హంగామాకు తెరదించుతూ, ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటో ఇదని, ప్రమోషన్ కోసం అలా పెట్టాల్సి వచ్చిందని కామెంట్ పెట్టింది. మొత్తానికి రెజీనా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెజినా ప్రస్తుతం తమిళంలో ‘జెమినీ గణేశన్ సొరూలి రాజనన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిందే ఆ ఫొటో.