శివ మళ్లీ చేయలేం -- నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా బుధవారం చిత్ర విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ‘ప్రేమమ్’ విజయం సాధించడం ఆనందంగా ఉందని, సినిమా చూసిన వెంటనే హిట్ అవుతుందన్న నమ్మకం కలిగిందని, అది నిజమైందని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్ స్వీట్ తిని చైతన్యను చూసినప్పుడు నా కళ్లల్లో తిరిగాయని, ఇలాంటి రీమేక్స్ చేయడానికి గట్స్ కావాలని, దర్శకుడు చందు మన నేటివిటీకి తగ్గట్టుగా చక్కగా తీశాడని అన్నారు. చాలామంది అఖిల్‌తోను, చైతన్యతోను ‘శివ’ తీయచ్చుగదా అని అడుగుతున్నారని, మళ్లీ అలాంటి సినిమాను చేయలేమని, కథలోని సోల్ తీసుకుని చందూ రూపొందించిన విధానం అద్భుతంగా ఉందని అన్నారు. ఈ సినిమాకు టైటిల్‌కూడా మొదట్లో నెగిటివ్ స్పందన వచ్చినా, ఇప్పుడు అదే కలసివచ్చిందని అన్నారు. చైతన్య మాట్లాడుతూ సినిమా రీమేక్ గురించి వంశీ చెప్పాడని, ఈ సినిమా చూసిన వెంటనే బాగా నచ్చడంతో చేశానని, తన కెరీర్‌కు ఈ సినిమా బెస్ట్ గిఫ్ట్ అని అన్నారు. దర్శకుడు చందూ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు.