నాన్న పాటకు అవార్డు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. టైటిల్ బావుందని, మంచి ఫీల్ కనబడుతోందని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘సినిమాకు ఏది అవసరమో దాన్ని ఇవ్వాలంటూ చెప్పిన వ్యక్తి దాసరి. దాసరి, కె.విశ్వనాథ్ వంటి దర్శకులు చూపించిన దారిలో ట్రావెల్ అయితే చాలు. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హనీష్ మాట్లాడుతూ.. ఆడియోను, సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానన్నారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ..‘బడ్జెట్ సినిమాలు బాగా తీసినా థియేటర్స్ దొరకని కారణంగా తీసేస్తున్నారు. ఇలాంటి బడ్జెట్ సినిమాలను టీవీల్లో కూడా చూడలేకపోతున్నాం. కారణం శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుకావడం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన టీవీ యాజమాన్యాలకు లేకపోవడం బాధాకరం. పెద్ద సినిమాల స్థాయిలో బడ్జెట్ సినిమాలు ప్రమోషన్స్‌కు ఖర్చుపెట్టడం లేదు. చిన్న సినిమాల సక్సెస్‌కు కారణం వౌత్ టాక్. కాబట్టి నిర్మాతలు సినిమా పబ్లిసిటీ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది మంచి టైటిల్, హీరోకు మంచి బ్రేక్ తెచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. పాటలు బావున్నాయి. యశోకృష్ణ మంచి మ్యూజిక్ అందించాడు. ఇందులో మూడు పాటలు నచ్చాయి. పాటలు, వాటి సందర్భాలు చూస్తుంటే దర్శకుడు సూర్యనారాయణ మంచి టాలెంటెడ్ అని తెలుస్తోంది. సుద్దాల అశోక్‌తేజ చాలా మంచి పాటలు రాశాడు. ఇందులో నాన్న పాటకు నేషనల్ అవార్డ్‌రావడం ఖాయం. సినిమా యూనిట్‌ను అభినందిస్తున్నాను’ అన్నారు. నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ ఆడియో, సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.