సూర్యతో చాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసి.. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది అందాల భామ కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో అవకాశాలు వస్తున్నా కూడా ఒక్క సినిమాకు ఓకే చెప్పడం లేదు. ఇక కోలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు లక్కీ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే విజయ్, ధనుష్ లాంటి హీరోల సరసన ఛాన్సులు కొట్టేసిన కీర్తిసురేష్‌కి తాజాగా హీరో సూర్య సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది.
నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా ఓకే అయ్యిందట. ఈ సినిమాలో ఇంతకుముందే హీరోయిన్ పాత్రకోసం నయనతార, సమంతల పేర్లు వినిపించాయి. కానీ చివర్లో కీర్తి ఈ ఛాన్స్ కొట్టేసింది. అయితే కావాలనే సూర్య, కీర్తికి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోను విడుదల కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తోంది కీర్తి.