ఇక విక్రమసింహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బాలయ్య 101వ చిత్రంగా రైతు చిత్రం వస్తుందని అప్పట్లో తెలిపారు. కానీ ఇప్పుడు 101వ చిత్రంగా ‘విక్రమసింహ’ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకెళితే బాలకృష్ణ హీరోగా ఎన్నో ఫ్యామిలీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమసింహ’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందింది. ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి రాలేదు. ఈలోగా బాలయ్య ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు. తాజాగా కోడి రామకృష్ణ ఈ చిత్రం గురించి తెలుపుతూ మళ్లీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘విక్రమసింహ’ చిత్రాన్ని సెట్స్‌పైకి తెస్తున్నట్టు చెప్పాడు. ఇప్పటికే 60 శాతం పైగా షూటింగ్ జరిగి, ఆగిపోయిన ఈ చిత్రాన్ని త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తిచేస్తారట. బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుందని తెలిపారు. మొత్తానికి బాలకృష్ణ హీరోగా గ్రాఫిక్స్ మాయాజాలంతో కోడి రామకృష్ణ సినిమా తెరకెక్కిస్తున్నారు.