ఆవు..పులి మధ్యలో ప్రభాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాకర్ (బాహుబలి ఫేమ్) ప్రధాన పాత్రలో రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందించిన చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ (ఇది యదార్థ కథ కాదు). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా కథనానికి ఎలాంటి పేరు పెట్టాలా అనుకుని, అనేక రకాలు ఆలోచించామని, ఈ కథకు ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ అన్న టైటిల్ అయితేనే బాగుంటుందని ఖరారు చేశామని తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ ఫార్మెట్‌లో డిఫరెంట్ కామెడీతో ఈ చిత్రం అందరికీ నచ్చేలా రూపొందిందని, సహజంగా తెలుగు చిత్రాల్లో హీరోనో, హీరోయినో ప్రేమ వైఫల్యం చెందడంతో కథ మొదలవుతుందని, కానీ ఈ చిత్రంలో విలన్ ప్రేమ వైఫల్యం నుండి కథ ప్రారంభం అవడం విశేషమని అన్నారు. నెల్లూరులోని నిజమైన రౌడీలు కొందరు ఈ చిత్రంలో నటించారని, కొత్తతరం ప్రేమకథతో తెలుగులో ఇప్పటికి రాని వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.