రెండు ఆత్మల పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్‌కుమార్, సన జంటగా స్వరూప ఆర్ట్స్ పతాకంపై కుర్ర రాజలింగు రూపొందించిన చిత్రం ‘రెండు ఆత్మల ప్రేమకథ’. సదివె దేవేందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, హీరోగా దర్శకుడిగా రెండు బాధ్యతలు రంజిత్‌కుమార్ చక్కగా నిర్వహించారని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా ప్రారంభించామని, చెప్పినదానికన్నా బాగా చిత్రాన్ని రూపొందించాడని ఆయన అన్నారు. ఈ సినిమా కథలో ఉండే హీరో పాత్రకోసం అనేక మందిని చూశామని, సరైన వారు దొరక్కపోవడంతో తానే హీరోగా నటించానని, పూర్తిస్థాయి హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిర్మాత చిత్రాన్ని రాజీపడకుండా రూపొందించారని దర్శకుడు రంజిత్‌కుమార్ తెలిపారు. త్వరలో మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని, అందుకు నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంధ్యశ్రీ, కావ్య, వీరు, సిద్ధు, సాయివెంకట్, వైజాగ్‌ప్రసాద్, తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కారె సతీష్‌కుమార్, ఎడిటింగ్: ధీరజ్ ఆర్ట్స్, నిర్మాత: కుర్ర రాజలింగు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రంజిత్‌కుమార్.