డిసెంబర్ 2న ధృవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘్ధృవ’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్స్ ఫ్యాన్స్‌లో అమితాసక్తిని ఏర్పరిచాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తనిఒరువన్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దాదాపు ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందట. వచ్చే నెలలో పాటలు విడుదల చేసి, డిసెంబర్ 2న విడుదల చేస్తారంటూ తెలిసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.