ఆచితూచి అడుగు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతాగ్యారేజ్’ సినిమా విడుదలయ్యాక జూ.ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ఏమిటి? అన్న సందిగ్ధత ఇంకా తొలగనే లేదు. సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అవడంతో అవకాశాలు భారీగా వస్తాయని, ఎన్టీఆర్ ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆచితూచి అడుగు వేస్తున్నాడు. గతంలో కథారచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించడానికి మాట ఇచ్చాడు ఎన్టీఆర్. మంచి కథ తయారు చేసుకుని రమ్మని కూడా చెప్పాడు. ‘జనతాగ్యారేజ్’ సినిమా తర్వాత అతని కథ విని ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదట. దాంట్లో మార్పులు చేర్పులు చేసుకొని రమ్మనడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరూ చెప్పకపోయినా ఇటీవల జూ.ఎన్టీఆర్ అన్న కల్యాణ్‌రామ్ తెలిపారు. వంశీ కథతో తాను సంతృప్తి చెందలేదని, అందుకే కొన్ని సన్నివేశాలు మార్పులు చూపించామని, ఆయన కథ సిద్ధం చేసుకుని వస్తే చూద్దామని చెప్పారు. ప్రస్తుతం వంశీ కథను వండటంలోనే లీనమైపోయారు. చూద్దాం ఆ కథ ఎన్నాళ్లకు సిద్ధవౌతుందో? ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎప్పుడు ప్రకటిస్తారో?