మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బొమ్మరిల్లు’ సినిమాతో సంచలన విజయం సాధించి ఎంతో గుర్తింపుతెచ్చుకున్నాడు దర్శకుడు భాస్కర్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆ సినిమా తన ఇంటిపేరుగా మారిపోయింది. ఆ సినిమా తరువాత పలు చిత్రాలను చేసిన భాస్కర్‌కు ఆ రేంజ్‌లో హిట్ అందించిన సినిమా ఒక్కటీ దక్కలేదు. ఇటీవలే ‘బెంగుళూరు డేస్’ అని ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేశాడు. అది కూడా నిరాశపర్చడంతో తెలుగులో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తాజాగా ఆయన చెప్పిన కథకు మెగా నిర్మాత అల్లు అరవింద్ ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు జరుపుతున్నాడట. అయితే, ఈ సినిమా అల్లు అర్జున్ కోసం కాదని తెలిసింది. మరి ఇందులో హీరోగా నటించేది అల్లు శిరీషా? సాయిధరమా? అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ మంచి అవకాశానే్న పట్టేశాడు.