ప్రేమకథతో నీ జతలేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘నీ జతలేక’ విడుదలై అన్ని కేంద్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్‌హిట్‌గా నిలుస్తోందని నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా తెలిపారు. నాగశౌర్య, పారుల్ యాదవ్, సరయు ప్రధాన పాత్రధారులుగా సత్యవిదుర మూవీస్ పతాకంపై లారెన్స్‌దాసరి దర్శకత్వంలో రూపొందించిన ‘నీ జతలేక’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా కథాకథనాలు ప్రతి ఒక్కర్నీ అలరిస్తున్నాయని, హీరోహీరోయిన్ల నటన బాగుందని, ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. దర్శకుడిగా దాసరి లారెన్స్‌కు మంచి మార్కులే పడుతున్నాయని, అన్ని రకాల ఎమోషన్స్‌కు ఆడియన్స్‌నుంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని వారు తెలిపారు.