బోస్‌గా పవన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్-దాసరిల చిత్రం ప్రకటించి చాలాకాలం జరిగిపోయింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. కానీ దీనిపై మీడియాలో రోజుకో వార్త పుట్టుకొస్తోంది. తాజాగా దాసరి తారకప్రభు ఫిలిమ్స్‌పై ‘బోస్’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ టైటిల్ పవన్ కోసమే అంటూ ప్రచారం ఊపందుకుంది. దాసరి నారాయణరావు తన బ్యానర్‌లో సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ తరుణంలో ఆయన ‘బోస్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించడంతో పవన్ కోసమే అనే వార్తలు వస్తున్నాయి. బోస్ టైటిల్ కాగా, సన్నాఫ్ ఇండియా అనేది క్యాప్షన్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా ఈ వారం నుండి రెండో షెడ్యూల్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.