సంపన్న తార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతున్న బుల్లితెర నటుల్లో ప్రియాంకకు ఎనిమిదో స్థానం లభించింది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ పదిహేనుమంది నటీమణుల పేర్లతో ఈ జాబితాను విడుదల చేసింది. అత్యధిక పారితోషికం (ఆదాయం) పొందుతున్న సినీతారల జాబితాలో బాలీవుడ్ నటి దీపికకు పదో స్థానం లభించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రియాంకకు టీవీ నటుల జాబితాలో చోటు దక్కింది. నిజానికి సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాలను విడుదల చేసింది. కాకపోతే అప్పుడు కేవలం సినీతారలుగా గుర్తిస్తూ జాబితాను రూపొందించారు. ఇప్పుడు ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాల ద్వారా నటీమణులను ఎంపిక చేశారు. ఈ జాబితాల్లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ తారలుగా దీపిక, ప్రియాంక రికార్డు సాధించినట్లయింది.
కాగా ఫోర్బ్స్ తాజా జాబితాలో మొదటి స్థానం ప్రఖ్యాత హాలీవుడ్ నటి, అమెరికాకు చెందిన 44 ఏళ్ల సోఫియా వెర్గరాకు దక్కింది. వరుసగా ఐదో సంవత్సరం ఆమె ఈ ఘనత సాధించింది. అమెరికాలో పాపులర్ అయిన టీవి షో ‘మోడర్న్ ఫామిలీ’లో కీలక పాత్ర పోషిస్తున్న వర్గరా తన టీవీ షోలు, ఇతర కార్యక్రమాల ద్వారా 43 మిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయాన్ని పొంది తొలి స్థానాన్ని పదిలపర్చుకుంది. ఇక ‘ది బిగ్‌బ్యాంగ్ థియరీ’లో నటిస్తున్న కాలెకౌకొ 24.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో రెండోస్థానంలోను, 15 మిలియన్ డాలర్ల ఆదాయంతో మిండి కాలింగ్ మూడోస్థానంలోను నిలిచారు. ఇక 14.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఎల్లెన్ పంపొయి, మరిష్క హర్గిటెలు నాలుగో స్థానంలో నిలిచారు. కాగా తొలిసారి అమెరికన్ టీవీ షోలలో నటించి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించినవారిలో ‘కేస్ట్లే’ స్టార్ స్టానా కాట్రిక్ ఏకంగా ఏడో స్థానంలో నిలిచింది. ఆమెకు భారతీయ నటి ప్రియాంక అంటే ఎంతో ఇష్టం. అలాగే అమెరికన్ టీవీ కార్యక్రమాల్లో తొలిసారి నటించిన జులియ లూరుూస్ డ్రేఫస్ (ది గుడ్ వైఫ్)కూ ఈ జాబితాలో చోటు దక్కింది. ‘స్కాండల్’ ఫేమ్ కెర్రి వాషింగ్టన్ ఆరో స్థానం (13.5 డాలర్లు) సాధించగా భారతీయ నటి ప్రియాంక చోప్రా 11 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నిజానికి ప్రియాంక గతేడాది తొలిసారిగా ఎబిసి సంస్థ నిర్మిస్తున్న అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో నటించి మెప్పించింది. ఈ ఏడాది రెండో సెషన్‌లోనూ నటిస్తోంది. ఆమె నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ షూటింగ్ మొదలైంది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం, ఆదాయం పొందుతున్న సినీనటుల్లో అగ్రస్థానంలో నిలిచిన ది రాక్ (డ్వేన్ జాన్సన్)తో ఈ చిత్రంలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో గతేడాది హిట్ చిత్రాలుగా నిలిచిన బాజీరావ్ మస్తానీ, జై గంగాజల్‌లో ఆమె అపూర్వ నటన ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం పదిహేనుమంది నటీమణుల పేర్లతో ఫోర్బ్స్ తాజా జాబితాను విడుదల చేసింది. కాగా గతనెలలో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న దీపికా పదుకొనే త్వరలో హాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది. విన్ డీసెల్‌తో కలసి ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్:రిటర్న్ ఆఫ్ గ్జాంటర్ కేజ్’లో ఆమె నటించనుంది.