ఇద్దరు హీరోయిన్లతో నాగచైతన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య తరువాతి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈమెతోపాటు మరో హీరోయిన్‌తో కూడా చైతు రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు వరుస హిట్లతో యంగ్ హీరోలకి లక్కీ హిరోయిన్‌గా మారిన లావణ్య త్రిపాఠి. లావణ్య ఇప్పటికే ‘్భలే భలే మగాడివోయ్, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయాలతో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ చిత్రంలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఉండబోతోందని వినికిడి. అలాగే ఈ చిత్రానికి ‘ఒకసారి ఇటు చూడవే’ అనే క్రేజీ టైటిల్‌ను కూడా లాక్ చేశారట. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం అందలేదు. ఇకపోతే నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ అక్టోబర్ 7న విడుదల కానుండగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మరో చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.