హీరోగా.. అనుకోని అదృష్టమే.. రోషన్‌పై శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిర్మలా కానె్వంట్ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను. రోషన్ ఎక్కడా టెన్షన్ లేకుండా కూల్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత షూటింగ్‌కు వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే పూర్తి స్వేచ్చతో నిర్ణయం తీసుకోమని చెప్పాం’ అని నటుడు శ్రీకాంత్ తెలిపారు. నాగార్జున సమర్పణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్స్, కానె్సప్ట్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన రోషన్ గూర్చి నటుడు శ్రీకాంత్ పలు విశేషాలు తెలిపారు.
అనుకోని అదృష్టం
రోషన్‌ను అప్పుడే హీరోగా పరిచయం చేయాలని అనుకోలేదు. అనుకోకుండా ఈ ఆఫర్ వచ్చింది. కథ చాలా బాగుండడం, నిర్మాతలుగా నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ ఉండడంతో ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చాం. ఈ సినిమాకు ఏం కావాలి, ఎలా చేయాలి, అందరితో ఎలా మెలగాలి అనే అనుభవం అతనికి వచ్చిందని అనుకుంటా. ఆ రోజు నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ చిత్రంలో రోషన్ ఉండేవాడు కాదు.
పూర్తి స్వేచ్ఛ
రోషన్‌కు ఏ విషయంలోనైనా పూర్తి స్వేచ్చ ఇచ్చాం. ఏదైనా సొంతంగా నిర్ణయం తీసుకుంటే నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలవు అని చెప్పాం. సినిమా చూసినవాళ్ళంతా బాగుంది అని చెబుతుండడంతో మేము కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వున్నాం. ఈ చిత్రంతో రోషన్‌కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం.
మాకు లేని అవకాశం..
మేము కొత్తగా పరిశ్రమకు వచ్చినపుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. అందుకే ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాం. అతనికి మంచి బ్యాక్‌గ్రౌండ్ వుంది. దానిని నిలబెట్టుకోవడానికి రోషన్ ఎంతో కృషిచేయాల్సి వుంది. డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా వుండాలని అతనికి చెప్పాను. అతను కూడా అలాగే ఉంటాడు.
క్రికెటర్‌గా..
రోషన్‌ను క్రికెటర్ చేద్దామని అనుకున్నాం. ఐదేళ్ల వయస్సునుండి అందులో కోచింగ్ కూడా ఇప్పించాం. ఉదయానే్న గ్రౌండ్‌కు తీసుకెళ్లేవాళ్లం. స్టేట్స్‌కు ఎంపికయ్యే సమయంలో రుద్రమదేవి చిత్రంలో అవకాశం వచ్చింది. అప్పటినుండి అతనికి సినిమాలపై ఆసక్తి పెరిగింది. మేమైతే అన్నీ నేర్పించాకే 20 ఏళ్ళకు హీరోగా చేద్దామనుకున్నాం.
నే విలన్‌గా..
అప్పట్లో నాగార్జునతో నేను విలన్‌గా నటించాను. ఇప్పుడు రోషన్ హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అని నాగార్జున ఎన్నో టిట్స్ చెప్పి ఎంకరేజ్ చేశారు. అదీగాక తొలిసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నా.
సినిమా చూశారా
సినిమా అంతా చూడలేదు. బిట్స్ బిట్స్‌గా చూశా. ఇప్పుడు విడుదలయ్యాక చూస్తా. ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న నమ్మకం వుంది. నాగార్జున పాడిన పాట హైలెట్‌గా నిలుస్తుంది.
ఆడియో వేడుకలో రోషన్ మాటలు
మైక్ పట్టుకుని మాట్లాడడం అందరికీ అబ్బే కళ కాదు. మొదట్లో నాకు భయం వేసేది. అసలు మాట్లాడేవాడినే కాదు. రోషన్ అలా మాట్లాడతాడని మేమూ ఊహించలేదు. ఇంట్లో చాలా తక్కువగా మాట్లాడతాడు. అలాంటిది ఒక్కసారిగా మా గురించి మాట్లాడినపుడు ఎమోషన్‌గా పీలై కళ్ళంబడి నీళ్లు వచ్చాయి.
భవిష్యత్తు ప్రణాళికలు
ఈ చిత్రంతో అతనికి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకుంటాను. రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని తరువాతి చిత్రం గూర్చి ఆలోచిస్తాం. ఇంకా ఎంతో అతను నేర్చుకోవాలి. ఎంత కష్టపడితే అంత విజయం లభిస్తుంది. అతనికి కరెక్టుగా ఏ పాత్రలు సూట్ అవుతాయో ఆ పాత్రలే చేస్తే బాగుంటుంది.
డాన్స్ విషయంలో
ఇప్పటి జనరేషన్ అంతా డాన్స్ బాగా చేస్తున్నారు. పోటీలో నిలబడాలంటే అవి తప్పనిసరి. చిన్నప్పటినుండి డాన్సులు చేస్తున్నాడు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది లక్. ఫిజికల్‌గా ఎన్ని ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే బాడీ అంత ఫిట్‌గా వుంటుంది. అప్పుడే మంచి సినిమాలు చేయగల్గుతాడు.

-యు