పింక్‌పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అవకాశాలు లేవని బాధపడడం వృధా. ఇక్కడ పనికి ఏమాత్రం కరువులేదు. అయితే, ఆ పనికి మనం సరిపోతామా లేదా అన్న నమ్మకం కలిగిస్తే చాలు, అవకాశాలు వాటికవే వస్తాయి’ అంటోంది తాప్సీ. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించినా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కొద్దో గొప్పో అవకాశాలు వస్తున్నాయి, మంచి నటిగా నిరూపించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘పింక్’ చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే, ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ నటించడమే. అమితాబ్‌బచ్చన్ సినిమాలో అవకాశమంటే సామాన్యం కాదుకదా అని అడిగితే, నిజం చెప్పమంటారా- అసలు ఆ చిత్రంలో బిగ్ బి నటిస్తున్నాడనే విషయం నాకు తెలియదు అంటోంది సొట్టబుగ్గల తాప్సీ. షూటింగ్‌కి వెళ్ళాక ఆయన వచ్చాక అర్థమైందని, బిగ్‌బితో నటిస్తున్నానని తెలిశాక చాలా ఆనందం అనిపించిందని, ప్రస్తుతం ఈ సినిమా విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకం వుందని చెబుతోంది. ఏది ఏమైనా పింక్ చిత్రం తన కెరీర్‌లోనే ఓ మలుపు తిప్పే విధంగా వుంటుందని, ఖచ్చితంగా పరిశ్రమలో ఓ మెట్టు పైకి ఎక్కడం గ్యారంటీ అంటోంది తాప్సీ.