ఒక్కడొస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్ కథానాయకుడిగా తమన్నా హీరోయినగా సురాజ్ దర్శకత్వంలో నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, విశాల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి మ్యూజిక్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. రష్యాలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాలో ఛేజ్ హైలెట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. తమన్నాకు శృతిహసన్ పాడిన పాట కూడా ఈ సినిమాకు హైలెట్‌గా వుంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో కథ, కథనం అందరికీ తెలిసిందేనని, అన్ని ఊళ్ళల్లో నిత్యం మనం చూస్తున్నదేనని, అటువంటి ఓ పాయింట్‌ను తీసుకుని కమర్షియల్ టచ్‌తో డిఫరెంట్‌గా రూపొందించారని అన్నారు. జగపతిబాబు ఓ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, తరుణ్ అరోరా విలన్‌గా చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యల గురించి ప్రశ్నించడానికి, వారికి న్యాయం చేయడానికి ఒక్కడు ఎలా వచ్చాడు అనే కథనంతో ఈ సినిమా సాగుతుందని ఆయన అన్నారు.