ఆ పాట నాగురించే రాసినట్టుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, వి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమాలోని టీజర్ పాటను నటుడు ప్రభాస్ ఆర్‌ఎఫ్‌సిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, ‘ఎప్పుడురా పెళ్లి’ అనే పాట తన గురించే రాసినట్టుగా వుందని, పాట చాలా వైవిధ్యంగా వుందని తెలిపారు. దర్శకుడు మంచి ప్రతిభ వున్న వ్యక్తిలా వున్నాడని, మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ‘గెడ్డం తెల్లబడిపోతావుందే’ అనే పాటను ఈరోజు ప్రభాస్ విడుదల చేయడం ఆనందంగా వుందని దర్శకుడు వాసుదేవ్ తెలిపారు. సినిమా మొత్తం పూర్తయిందని, సెప్టెంబర్ 10న ఆడియో విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో రామ్‌శంకర్, నిర్మాతలు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. కమల్ కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృధ్వీ, కృష్ణ్భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం:రాహుల్‌రాజ్, వాసుదేవ్, కెమెరా:జగదీష్ చీకటి, రచన, దర్శకత్వం:వాసుదేవ్.