కోయ భాషలో ఓ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత విజయ్‌వర్మ గతంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కోయ భాషలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చిన్నతనం నుండీ గిరిజనులతో మమేకమై పెరిగానని, వారి సంస్కృతి సంప్రదాయం, సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని చత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలతోపాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికంగా వున్న కోయల కోసం స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా సమాంతరంగా రూపొందిస్తామని, ప్రజా సినిమా పతాకంపై పలు భాషలలో సందేశాత్మక చిత్రాలను అందివ్వాలనే కోరికతో తొలిసారిగా కోయ భాషలో ఈ సినిమా రూపొందిస్తున్నామని, వాస్తవికతకు అద్దంపట్టేలా సినిమా వుంటుందని ఆయన అన్నారు.