యదార్థ సంఘటనల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విశారణై’పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం.. ‘విచారణ’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ‘ది క్రైమ్’ అన్నది ట్యాగ్‌లైన్. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సమర్పణలో కల్పనా చిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు ‘ఆదుకాలం’‘ అనే చిత్రం రూపొందించి, ఆ చిత్రానికి కూడా జాతీయ అవార్డు అందుకున్న ‘తమిళ సంచలనం’ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విచారణ’ చిత్రం తమిళ వెర్షన్‌కు ప్రముఖ హీరో ధనుష్ నిర్మాత కావడం విశేషం. ఓ ఆటోడ్రైవర్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, రజనీ, కమల్‌హసన్ వంటి సూపర్‌స్టార్స్ ప్రశంసలు దండిగా పొందింది. ‘ఇటీవలికాలంలో ఇంత గొప్ప చిత్రాన్ని తాము చూడలేదని’ పలువురు ప్రఖ్యాత దర్శకులు సైతం ఈ చిత్రంపై అభినందనల వర్షం కురిపించారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన ఆనందిని అచ్చ తెలుగు అమ్మాయి కావడం మరో ముఖ్య విశేషం. చిత్ర సమర్పకులు సి.కల్యాణ్ మాట్లాడుతూ, ‘విచారణ’ (ది క్రైమ్) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, సాధారణంగా అవార్డులు పొందిన సినిమాలకు రివార్డులు (కలెక్షన్లు) అంతగా రావని, అలాగే, రివార్డ్స్ వచ్చిన సినిమాలకు అవార్డులు రావని, కానీ ఈ చిత్రానికి రివార్డులు, అవార్డులు సమానంగా వచ్చాయని, తమిళంలో అసాధారణ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ చాలా పెద్ద విజయం సాధించడం ఖాయమని అన్నారు.