ఫోర్బ్స్ జాబితాలో దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో గత ఆర్థిక సంవత్సరంలో సినిమాలు, టీవీలు, ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారా అత్యధిక ఆదాయం పొందిన సినీ నటీమణుల్లో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ వరుసగా రెండోసారికూడా మొదటి స్థానంలో నిలిచింది. 2015 జూన్ 1నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఆమె ఆర్జించిన ఆదాయం 46 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఇక ఘోస్ట్‌బస్టర్ చిత్రాలతో పేరుపొందిన నటి మెల్లిసా మెక్‌కార్తి 33 మిలియన్ డాలర్ల మొత్తంతో రెండో స్థానాన్ని, ఘోస్ట్ ఇన్ ది షెల్ ఫేమ్ స్కార్‌లెట్ జాన్సన్ 25 మిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సాధించారు. జెన్నిఫర్ అనిస్టన్ 21 మిలియన్ డాలర్లు, చైనాకు చెందిన హాలీవుడ్ నటి ఫిన్ బింగ్‌బింగ్ 17 మి. డాలర్లు, ఛార్లెజ్ ధిలౌన్ 16.5 మి. డాలర్లు, అమీ అడమ్ 13.5 మి.డాలర్లు, జులియా రాబర్ట్స్ 12, మిలా కునిస్ 11 మి. డాలర్లు, భాలీవుడ్ నటీమణి దీపిక పదుకొనె 10 మిలియన్ డాలర్లతో చివరి పది స్థానాల్లో నిలిచారు.

పారితోషికం తక్కువే... కానీ ఆదాయం ఎక్కువ

బాలీవుడ్ భామ దీపికా పదుకొనె క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటిగా తనదైన ఇమేజ్‌తో స్టార్ స్టేటస్ అందుకున్న దీపిక, హాలీవుడ్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రంలో హీరో విన్ డీజిల్‌తో కలిసి నటిస్తున్న ఈమె, దానికి తగ్గట్టుగానే పాపులారిటీని పెంచుకునే పనిలో పడింది. ఈమధ్యే ‘బాజీరావు మస్తానీ’ సినిమాతో నటిగా అవార్డులు అందుకున్న దీపికకు ఇపుడు బాలీవుడ్‌లో అవకాశాలు క్యూకట్టాయి. దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్‌ను వసూలు చేస్తున్న ఈమె, మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన భామల్లో దీపికకు పదోస్థానం దక్కింది. ఈ ఏడాది ఆమె సంపాదన 10 మిలియన్ డాలర్లట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 68కోట్లు ఒక్క సంవత్సరంలోనే. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ లిస్టు జాబితాలో టాప్ టెప్ ప్లేస్‌ను దక్కించుకుని సంచలనం క్రియేట్ చేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్‌వరకు జరిపిన సర్వేలో దీపిక పదవ స్థానానికి చేరుకుంది. ఈలెక్క బాలీవుడ్‌లో దీపిక రేంజ్ ఎలాంటిదో తెలుస్తోంది. అన్నట్లు సినీనటిగా పారితోషికం విషయంలో ఆమె చాలామందికన్నా తక్కువే. కానీ ప్రకటనలు, సినీరంగంతో సంబంధం ఉన్న ఇతర వ్యాపారాల ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించడం ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చేరిన తొలి భారతీయ నటిగా రికార్డు సాధించింది.