అందమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓకె బంగారం’ విజయంతో హీరో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జంటకు మంచి పేరొచ్చింది. వారి కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్‌ఎస్‌సి మూవీస్ పతాకంపై ఎస్.వెంకటరత్నం నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాళీ సుధీర్ మాట్లాడుతూ, ‘అందమైన అద్భుతమైన ప్రేమకథ ఇది. దుల్కర్-నిత్యామీనన్‌లు ఈ జనరేషన్‌లో బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ప్రతిఒక్కరికీ నచ్చే సినిమా ఇది. ఇందులో హీరో హీరోయిన్ల పేర్లు రావుగోపాలరావు, సావిత్రి. తప్పకుండా అందరినీ అలరిస్తారు’ అని అన్నారు. నిర్మాత వెంకటరత్నం మాట్లాడుతూ, మేనేజర్‌గా వున్న నేను నిర్మాతగా మారినందుకు ఆనందంగా వుందని అన్నారు. హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ఓకె బంగారం తరువాత హైదరాబాద్ రావడం రెండోసారని, నిత్యామీనన్‌తో కలిసి నేను చేస్తున్న మూడో చిత్రమిదని అన్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో కూడా మంచి విజయం సాధించాలని అన్నారు. హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ, ‘ఉస్తాద్ హోటల్ వంటి జాతీయ సినిమా తరువాత తాను, దుల్కర్ కలిసి ‘ఓకె బంగారం’లో నటించాం. అది పెద్ద విజయం సాధించింది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. డిఫరెంట్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.