26న అవసరానికో అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేష్.కె.వి దర్శకత్వంలో రూపొందిన ‘అవసరానికో అబద్ధం’ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్, సందీప్ మాట్లాడుతూ- సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్ట్ఫికెట్ పొందిందని, ప్రతి మనిషి జీవితంలో ఎక్కడోఅక్కడ అబద్ధం ఆడి వుంటాడు కనుక అదే పేరును ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టామని తెలిపారు. ప్రధానమైన కథ కూడా అబద్ధం అనే మాటపైనే ఆధారపడి సాగుతుందని, అలా అబద్ధం ఆడిన కొందరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? చివరికి వారు ఆ ఇబ్బందులనుండి ఎలా బైటపడ్డారు అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. వారం ముందు ప్రదర్శించిన ప్రివ్యూకు మంచి ఆదరణ లభించిందని, ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగే కథనమే ఈ చిత్రానికి హైలెట్ అని దర్శకుడు సురేష్.కె.వి. తెలిపారు. ఒరిస్సా, కూర్గ్, తలకోన, మసీనాగుడి లాంటి దట్టమైన అడవుల్లో 46 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు.