రానుగాక రాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ నయనతార ఈమధ్య కోలీవుడ్‌లో మాంఛి జోరు పెంచింది. వరుస అవకాశాలతో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే చాలాకాలం తరువాత తెలుగులో బాబు బంగారం చిత్రంలో నటించింది. సినిమా కమిట్‌మెంట్‌కు ముందే ప్రమోషన్‌లో పాల్గొనని కండిషన్లు పెడుతోందట. కోట్లకు కోట్లు పెట్టి తీసిన సినిమాకు సరైన ప్రమోషన్ ఇవ్వక చాలా సినిమాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే బాబు బంగారం సినిమా ఆడియోకిగాని, సక్సెస్‌మీట్‌కు కాని రాలేదు. అలాగే, తమిళంలో విక్రమ్ సరసన నటించిన ‘ఇరుమగన్’ చిత్రం తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ ఆడియో వేడుకకు కూడా ఈమె డుమ్మా కొట్టింది. దాంతో దర్శక నిర్మాతలు నయనపై గుస్సా అవుతున్నారు. రెమ్యూనరేషన్ పరంగా బాగానే తీసుకుంటున్న ఈమె, ప్రమోషన్లకు మాత్రం రావడానికి ఏం కష్టమో అని అనుకుంటున్నారట. తాను ప్రమోషన్‌లో పాల్గొంటే ఆ సినిమాలు హిట్ అవ్వవని సెంటిమెంటు పెట్టిందట. అయినా సినిమాలో విషయం వుంటే ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు పనిచేయవు కదా!

చిత్రం.. నయనతార