లఘు చిత్రాల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిషేక్ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలు ని ర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- అభిషేక్ ఏదైనా కొత్తగా చేయాలని అంటుంటాడని, చిత్ర నిర్మాణంలోకి వచ్చిన ఆయన వరుసగా నాలుగు చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. నాలుగు కథలు కొత్తగా ఉన్నాయని, ప్రతిభ వున్నవారిని పరిశ్రమకు అందించాలనే తలంపుతో షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తుండడం సంతోషంగా వుందని తెలిపారు. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని వేదికగా యువ దర్శకులు ఉపయోగించుకుంటారని తాను ఆశిస్తున్నట్లుగా తెలిపారు. మనం లఘు చిత్రాలను ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన రావడంతో ఈ పోటీ ఆలోచన వచ్చిందని, కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్న అనేకమందిని ప్రోత్సహించాలన్న ఉత్సాహంతో ఈ పోటీ నిర్వహిస్తున్నామని, ఈనెల 20 నుండి వచ్చే నెల 15 వరకూ షార్ట్ ఫిలిం మేకర్స్ తమ సినిమాను పంపించవచ్చని, వచ్చినవాటిలో 20 చిత్రాలను ఎంపిక చేసి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శిస్తామని, ఉత్తమమైన మూడు సినిమాను ఎంపిక చేసి తమ సంస్థలో దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో నందినిరెడ్డి, తరుణ్‌భాస్కర్, అడివి శేష్, మణిశంకర్, రవికాంత్ పేరేపు, సుధీర్‌వర్మ, బాలరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.