ఆదితో నాన్న కోరిక తీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆది, నటుడు సాయికుమార్‌లు చెప్పిన విశేషాలు..
మా ఇద్దరి కాంబినేషన్
సాయికుమార్: ఈ సినిమాతో నేను, ఆది చేసిన మొదటి కాంబినేషన్ ఇది. చాలా రోజులనుంచీ ఎదురుచూస్తున్నాం. ఇన్నాళ్లకి ఈ సినిమాతో కుదిరింది. ఇందులో మంచి పాత్ర నాది. చిన్నప్పటినుంచీ తెలుగుతనం అంటే ఇష్టం. ఇందులో ఆ తరహాలో వుండే దొరబాబు పాత్రలో నటిస్తున్నాను. మన నేటివిటీకి దగ్గరగా వుంటుంది.
ఆది: ప్రేమకావాలి సినిమా తరువాత చాలామంది నాన్నతో కలిసి ఎప్పుడు చేస్తావని అడుగుతున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది.
పవర్‌ఫుల్ పాత్ర
సాయికుమార్: మా నాన్న హీరో అవ్వాలని ఇండస్ట్రీకివచ్చారు. కానీ ఆయన నటుడిగానే మిగిలిపోయారు. నేను కూడా డబ్బింగ్‌లు అవీ చెబుతూ వున్న నాకు పోలీస్ స్టోరీ సినిమా కమర్షియల్‌గా హీరోని చేసింది. ఆ తరువాత చాలా పాత్రలు చేసినా, చాలామంది అలాంటి పవర్‌ఫుల్ పాత్ర చేయాలని అడుగుతున్నారు. ఈ చిత్రంలో అలాంటి పాత్రే దొరబాబుది. ‘తప్పు చేయడం మీ లెక్క, సరిచేయడం నా లెక్క. లెక్క క్లియర్ అయినట్టే’ అని చెప్పే డైలాగ్ బాగా నచ్చింది.
ఆది: ఇందులో నేను రికవరీ బాబ్జిగా కన్పిస్తాను. చాలా సరదాగా వుండే కుర్రాడి జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో ఇరుక్కున్న అతను ఎలా బయటపడ్డాడు. ఏం చేశాడన్నదే కథ.
వీరభద్రమ్ స్టైల్లోనే
సాయికుమార్: పూలరంగడు, అహనా పెళ్ళంట సినిమాల తరహాలో వుండే చిత్రమిది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కించాడు. ముఖ్యంగా వీరభద్రమ్‌కు మంచి కమిట్‌మెంట్ వుంది.
ఆది: నేను చేసిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ ఇది. వీరభద్రమ్ కథ చెప్పినపుడు చాలా బాగా నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆయన ఎలా డీల్ చేస్తాడో అందరికీ తెలుసు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రూపొందించాడు. నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది.
నాన్న కోరిక తీరింది
సాయికుమార్: నాన్న హీరో అవ్వాలనుకున్నాడు, కాలేదు. నేను కూడా హీరో అయ్యాను కానీ డాన్సులు గట్రా చేయలేదు కాబట్టి ఆయన కోరిక ఆదితో తీరింది. ఆది చేసిన ప్రతి సినిమాను విజయనగరం వెళ్లి మొదటి షో చూసేవాడు. ఈసారి నేను వెళ్లి చూడాలనుకుంటున్నా.
ఆది: ఈ సినిమాతో నాన్నతో నటించడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా కథకు కీలకమైన పాత్రలో ఆయన కన్పిస్తాడు.
అవి నిరాశపరిచాయి
సాయికుమార్: ఆది హీరోగా మంచి కమిట్‌మెంట్లతో సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా చాలా ఆశలు పెట్టుకున్న గరమ్ సినిమా నిరాశనే మిగిల్చింది. దాంతోపాటు రఫ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథలు విన్నప్పుడు బాగానే అన్పించినా కూడా అవి ఎక్కడో మిస్‌ఫైర్ అయ్యాయి.
ఆది: నేను విన్న కథల్లోకెల్లా గరమ్ సినిమా కథ బాగా నచ్చింది. చాలా బాగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను కానీ అది రివర్స్ అయింది. ఏదైనా ప్రతి సినిమాతో ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాను. ముఖ్యంగా ఈ సినిమాతో ఇంకాస్త ఎక్కువ మెచ్యూరిటీ వచ్చిందనుకుంటాను.
తదుపరి చిత్రాలు
సాయికుమార్: ప్రస్తుతం జనతాగ్యారేజ్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కన్పిస్తాను. దాంతోపాటు కన్నడలో కూడా ఓ సినిమా చేశాను.
ఆది: ప్రస్తుతం రెండు మూడు స్క్రిప్ట్‌లు చర్చల దశలో వున్నాయి. దాంతోపాటు తెలుగు కార్తికేయ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమాతో కన్నడంలోకి ఎంట్రీ ఇస్తున్నాను.

-శ్రీ