నా కెరీర్‌లో భిన్నమైన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తన రెండో సినిమాతోనే సత్తా నిరూపించుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తిక్క’. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై రోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలకు సిద్ధమైంది. లారిస్సా బొనేసి, మన్నారా చోప్రాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘తిక్క’ విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ చెప్పిన విశేషాలు...
‘తిక్క’పై మీ అంచనా, నమ్మకం..?
- ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నా కెరీర్‌లో భిన్నమైన సినిమా. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేశాక, మొదటిసారి ఓ డిఫరెంట్ సినిమా చేశా.
డిఫరెంట్ సినిమా అంటున్నారు.. ఇంతకీ కథేంటి?
- దర్శకుడు సునీల్ చెప్పిన కథ బాగా నచ్చింది. హీరో ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. అతని లవ్ బ్రేక్‌అప్ అవుతుంది. దాంతోనే కథ మొదలవుతుంది. అతని జీవితంలో వచ్చిన మార్పులేమిటన్నదే కథ.. ఇది నిజంగా కొత్తగా ఉంటుంది.
తిక్క టైటిల్‌కు కారణం?
- హీరో జీవితంలో అన్ని సంఘటనలు తిక్క తిక్కగా జరుగుతుంటాయి. దీంతో అతను చేసిన తిక్క పనులు ఏమిటి అన్నదే ఈ సినిమా. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు ఎలా డీల్ చేశారు?
- దర్శకుడికి టెక్నికల్‌గా కూడా మంచి గ్రిప్ వుంది. అందుకనే ప్రతి విషయంలో ఆయన ఎంతో కేర్‌తో చేశాడు. నిర్మాత రోహన్‌రెడ్డి కూడా ఎక్కడా రాజీపడలేదు.
హీరోయిన్స్ ఇద్దరున్నారు.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీనా?
- కాదండీ.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా మొదటి హీరోయిన్ లారిస్సా బొనెసితో హీరోకి లవ్ బ్రేక్‌అప్ జరుగుతుంది. మన్నారా హీరోని ప్రేమిస్తూ ఫాలో అవుతూ వుంటుంది.
తాగుబోతు సీన్స్ బాగా చేసినట్టున్నారు..
అనుభవం వుందా?
- (నవ్వుతూ) లేదండీ బాబూ.. ఒక్క చుక్క కూడా తాగలేదు. ఈ సీన్స్ చేయడానికి తాగుబోతు రమేష్ బాగా హెల్ప్ చేశాడు. చిరంజీవి, పవన్‌ల సినిమాలు కూడా చూశాను.
కథల ఎంపికలో దేనికి ప్రాధాన్యం?
- కథకే ప్రాధాన్యత ఇస్తా. వినగానే అది మనకు సూట్ అవుతుందా? లేదా? అని అంచనా వేసుకుంటా. ఆ తర్వాత అవసరమనుకుంటే ఏవైనా మార్పులు చెబుతా.
ఆకతాయి సినిమా ఎంతవరకు వచ్చింది?
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఆకతాయి అనే టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెడతాం.
కృష్ణవంశీ సినిమాలో గెస్ట్‌రోల్ చేస్తున్నారట..
- కృష్ణవంశీతో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తా. ఒకరోజు ఆయన కనిపించి- ‘ఓ చిన్న గెస్ట్ పాత్ర ఉంది, చేస్తావా?’అని అడిగారు.. వెంటనే సరే అన్నా.
కళ్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నారట?
మరి మెగా హీరోలతో ఎప్పుడు?
- అవును, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అది ఫైనల్ కాలేదు. మెగాహీరోలతో ఎప్పుడైనా నేను రెడీ. కథలు కుదరాలిగా.
ఇతర భాషల నుండి అవకాశాలు వస్తున్నాయా?
- వస్తున్నాయి, కానీ పక్కాగా మాత్రం రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తా.

- శ్రీ