ఇక రోజూ ఐదు ఆటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ థియేటర్ల షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు ఈ నెలాఖరునుంచి థియేటర్లలో ఐదు ఆటలకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దినేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శించేందుకు వీలుగా రోజూ ఐదు ఆటల్ని ప్రదర్శించేలా అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, వాణిజ్య ప్రాంతాలు, బస్‌డిపోలలో 200 సీట్ల సామర్థ్యం వున్న మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించింది.