19న చుట్టాలబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీనికి యు/ఎ సెన్సార్ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, హీరో ఆది నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో అన్ని వర్గాలకు కావలసిన అంశాలు ఉన్నాయని తెలిపారు. పూలరంగడు, అహనాపెళ్ళంట చిత్రాల స్థాయిలో దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, ఇది తమ సంస్థకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకముందని వారన్నారు.
సాయికుమార్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్‌చంద్ర, రచ్చరవి, గిరిధర్, అనితానాగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా:ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మాటలు:్భవాని ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.