చుక్కలు చూపిస్తోందట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో మెప్పించి హాలీవుడ్‌లో ప్రవేశించి అక్కడి వారందరినీ తన చుట్టూతా తిప్పుకుంటున్న భామామణి ప్రియాంక చోప్రా. కళ్ళు జిగేల్‌మనిపించే అందంతో, అద్భుతమైన నటనతో హాలీవుడ్‌నే ఏలుతున్న నటి ఆమె. క్వాంటికో సిరీస్‌తో హాలీవుడ్‌లోప్రవేశించి ‘బేవాచ్’తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకుంది. ప్రస్తుతం బేవాచ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వుంది. అమెరికాలో ప్రియాంకకు వస్తున్న క్రేజ్‌ను చూసి హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఈమెను తమ సినిమాలలో నటించమని తెగ బతిమిలాడుతున్నారట. అయితే, ఆమె వారి ఆఫర్లను సున్నితంగానే తిరస్కరిస్తున్నట్టు టాక్. ఇప్పటికే ఆమె చుట్టూ ఆరు, ఏడుగురు వరకు హాలీవుడ్‌కు చెందిన దర్శకులు ప్రదక్షిణలు చేసి నిరుత్సాహాన్ని చవి చూసినట్లు తెలుస్తుంది. అమెరికా టెలివిజన్ ‘ప్రాజెక్టు రన్‌వే’ అనే ప్యాషన్ రియాలిటీ షోలో పాల్గొంటున్న ప్రియాంక మాట్లాడుతూ- తానెప్పుడూ ఒకే మూస కథలలో నటించదలచుకోవడం లేదని, ఎప్పటికప్పుడు నూతనంగా ఉండేవాటి కోసమే వెంపర్లాడుతుంటానని సెలవిచ్చింది. తాను ఒకే సమయంలో ఒకే సినిమా చేస్తానని, పలు సినిమాలను ఒప్పుకోవడం ద్వారా క్రియేటివ్ ఫ్రస్టేషన్‌కు గురవుతున్నట్లు వివరించింది. తాను ఇప్పుడు 70ఎంఎం హాట్‌గాళ్‌ని అనీ, తాను నటించే సినిమాలుగానీ, సిరీస్‌లుగాని 70ఎంఎం థియేటర్లలోనే చూస్తానని తెగ ఫోజులు పోతోంది ఈ అందాల ముద్దుగుమ్మ. బాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులైన సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్, జొయా, పర్హాన్ అక్తర్‌ల సినిమాలకు ఎందుకు ‘నో’ చెప్పిందో అది ఆమెకే తెలియాలి.