చైతూ సరసన తమన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటిల్ చూసి నాగచైతన్య సమంతను కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారా? కాదు.. చైతు-సమంతలమధ్య ప్రేమాయణం ఓ వైపు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి చైతు నెక్స్ట్ సినిమా అదే ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందే ‘కళ్యాణం’ సినిమాలో ముందు సమంతనే హీరోయిన్ అనుకున్నారు. కానీ సమంత డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు తమన్నా వచ్చి చేరింది. నాగచైతన్య ప్రస్తుతం ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. మలయాళ సూపర్‌హిట్ ‘ప్రేమమ్’ చిత్రానికి రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా తరువాత చైతు నటించే సినిమాలో ఇప్పుడు హీరోయిన్ మారింది. చైతు, తమన్నా కలిసి ఆమధ్య 100 పర్సెంట్ లవ్ చిత్రంలో మంచి రొమాన్స్ పండించారు. ఇప్పుడు ఆ మాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.