చిరు సినిమాకు ప్రభుదేవా డాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150వ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. మొన్నటి వరకు హీరోయిన్ విషయంలో తెగ టెన్షన్ పడ్డ 150వ సినిమా యూనిట్... ఎలాగోలా కాజల్‌ని ఖరారు చేసింది. ఇక తర్వాత ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి రోజుకో వార్త హల్‌చల్ చేసింది. తాజాగా ఇప్పడు కొరియోగ్రఫీకి సంబంధించి మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది.
దేవిశ్రీ సంగీతం అందిస్తున్న చిరు 150వ సినిమాలో ప్రభుదేవా ఒక పాటకి డాన్స్ కంపోజ్ చెయ్యబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. చిరంజీవి పాత సినిమాల్లో ప్రభుదేవా కంపోజ్ చేసిన డాన్స్‌లకు ఇప్పటికీ స్టేజ్‌మీద మంచి క్రేజ్ వుంది. అందుకే చిరు కూడా తన 150వ సినిమాలో ఒక సాంగ్ కంపోజ్ చేయమని ప్రభుదేవాని అడుగగా అతను ఆనందంగా ఒప్పుకున్నాడని సమాచారం. అయితే వీరిద్దరూ మొన్నామధ్య దేవిశ్రీ లైవ్ షోలో కలిసినపుడు ఈ విషయం మాట్లాడుకున్నారని టాక్. ఇక 150వ సినిమాలో ప్రభుదేవా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు అంటే ఇక ఆ డాన్స్‌ని చిరు ఏ రేంజ్‌లో అదరగొడతాడో మరి.