రంగనాథ్‌కు అశ్రునివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమానాస్పద స్థితిలో మరణించిన నటుడు రంగనాథ్‌కు తెలుగు చలనచిత్రసీమ, అభిమానులు అంతిమవీడ్కోలు పలికారు. అశ్రునివాళి అర్పించారు. శనివారం ఆయన ఆత్మహత్య పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. అనంతరం బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆయన కుమారుడు చితికి నిప్పంటించి అంతిమసంస్కారం చేశారు. అంతకముందు కడసారిచూపుకోసం ఫిలించాంబర్‌కు పెద్దఎత్తున సినీప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఆయనతో తమకు ఉన్న పరిచయాన్ని ప్రముఖులంతా గుర్తుతెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తెలం గాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిరంజీవి, మురళీమోహన్, జమున, రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, విజయ్‌చందర్, హేమసుందర్, శివపార్వతి తదితరులు ఆయన కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నటుడు చిరంజీవి మాట్లాడుతూ రంగనాథ్ తాను కలసి ‘లవ్‌ఇన్ సింగపూర్’ అనే చిత్రంలో హీరోలుగా నటించామని, అప్పటి నుండి ఆయనతో సత్సంబంధాలు సాగుతూనే వున్నాయని, ఎన్నో చిత్రాలలో కలిసి నటించామని తెలిపారు. ఆయన మరణ వార్త విని షాక్‌కు గురయ్యానని చెప్పిన ఆయన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు సినీ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నెమరువేసుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అనుభవం వున్న నటుడ్ని కోల్పోయిందని, ఆయన లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు. రంగనాథ్ అంత్యక్రియలకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హాజరై నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్మశాన వాటికకు భారీగా తరలివచ్చిన ఆప్తులు, అభిమానులు తమ అభిమాన నటుడికి కడసారి వీడ్కోలు పలికారు.
chitram...
కన్నీటి పర్యంతమవుతున్న రంగనాథ్ కుటుంబ సభ్యులు. శ్రద్ధాంజలి ఘటిస్తున్న చిరంజీవి, జమున, శివాజీరాజా, మంత్రి తలసాని, రాళ్లపల్లి, పరుచూరి, గిరిబాబు, శివకృష్ణ