షీ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతామీనన్ ప్రధాన పాత్రలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు రూపొందిస్తున్న ‘షీ’ (ఈజ్ వెయిటింగ్) చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఫారెస్ట్ లొకేషన్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశంపై రమ్య క్లాప్ ఇవ్వగా, అనూప్‌సింగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శే్వతామీనన్ మాట్లాడుతూ ఈ కథ తనకెంతో నచ్చిందని, షీగా టైటిల్ రోల్‌లో నటిస్తున్నానని, మంచి చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందాన్నిస్తోందని అన్నారు. తమిళంలో అవకాశాలు బాగా వస్తున్న నేపధ్యంలో ఈ కథ విని, మంచి కమర్షియల్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్రంలో నటిస్తున్నానని కథానాయకుడు మహత్ రాఘవేంద్ర అన్నారు. ఓ అందమైన ప్రేమకథకు హారర్ ఎలిమెంట్స్ జోడించి, తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక వర్గమంతా చక్కగా కుదిరిందని, అందరికీ నచ్చే ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నామని దర్శకుడు రమేష్‌మహేంద్ర తెలిపారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా హారర్, లవ్, రొమాన్స్, ఎమోషన్ లాంటి అన్ని అంశాలు కలిపి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 4నుండి ప్రారంభం కానుందని నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెల చివరికి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ మొదటివారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో చేతన ఉత్తేజ్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలె, కెమెరా: అనిత్, డాన్స్: ఎర్రోళ్ల రమేష్, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వరరావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.