వినోదం 100% ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌భరత్, అశ్విని, కాంచన ప్రధాన తారాగణంగా ఎస్‌ఎస్‌సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యభరిత చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సంపూర్ణేష్‌బాబు, పృధ్వీ కీలకమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే సినిమా కథంతా అర్ధం అయ్యేలా రూపొందించారని, యువతకు నచ్చే ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని తెలిపారు. మొదటినుండి చివరి వరకు వందశాతం కామెడీతో కడుపుబ్బ నవ్వించాలనే ఉద్దేశంతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బ్యాంకాక్, థాయిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చేసామని,క్రిస్మస్‌కు ఆడియో విడుదల చే యనున్నామని అన్నారు. సంపు, పృధ్వీల కామెడీ హైలైట్‌గా నిలిచే ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని దర్శకుడు జైశ్రీరామ్ అన్నారు. కార్యక్రమంలో విజయ్‌భరత్, అశ్వని తదితరులు పాల్గొన్నారు. సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, తా.రమేష్, జీవా, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం-సుభాష్ ఆనంద్, కెమెరా-రాజేష్, ఎడిటింగ్-నందమూరి హరి, నిర్మాత-పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-జైశ్రీరాం.