పల్లెటూరిలో సోగ్గాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున కథానాయకుడిగా అక్కినేని అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను నాగార్జున వివరించారు. తన తండ్రి కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన వాటిలో గ్రామీణ నేపథ్యంలో చేసిన సినిమాలలో ఓ విశేషమైన గెటప్ ఆయనకు ప్రత్యేకంగా ఉండేదని, అలాంటి చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని అన్నారు. తానుకూడా ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యంలో వున్న పాత్రను నటిస్తున్నానని, తన గెటప్‌కి కూడా ఓ విశేషం ఉందని, అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు పాత సినిమాల్లో ఉపయోగించిన పంచెను, 1959లో ఆయన కొనుగోలుచేసిన రిస్ట్‌వాచ్‌ని ఈ చిత్రంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు. బంగార్రాజుగా తానునటిస్తున్న ఈ చిత్రంలో పాత్ర అంతా ఆయన చేసిన సినిమాలను చూసే గ్రౌండ్‌వర్క్ చేసానని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కధానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం-అనూప్‌రూబెన్స్, కెమెరా-పి.ఎస్.వినోద్, రచన-సత్యానంద్, ఎడిటింగ్-ప్రవీణ్‌పూడి, నిర్మాత-అక్కినేని నాగార్జున, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-కల్యాణకృష్ణ కురసాల.