మా రెండో అన్నయ్య గుర్తుకొచ్చాడు .. పరుచూరి గోపాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘్భలే మంచి రోజు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వివరాల్ని తెలియజేస్తూ ఈ చిత్రంలో మెకానిక్‌గా నటిస్తున్నానని, భాష, వేషం అంతా అదే స్థాయిలో ఉంటుందని అన్నారు. ఈ పాత్ర ఒప్పుకోవడానికి కారణం మా రెండో అన్నయ్య మెకానిక్ అని, ఆయన్ను దగ్గిరుండి చూశాను కాబట్టి ఈ పాత్రను చేయాలనిపించిందని, ప్రస్తుతం మా అన్నయ్య లేడని, ఇక ఈ పాత్ర గురించి చెప్పాలంటే ఇందులో తాను సుధీర్‌బాబుకి తండ్రిగా కనిపిస్తానన్నారు. పనీపాటా లేకుండా గాలికి తిరిగే అబ్బాయికి, అందమైన అమ్మాయి దొరికితే ఎలా వుంటుందన్న ఆసక్తికర అంశంతో ఒక్క రోజులో జరిగే కథ ఇదని వివరించారు. నాకు ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరూ రెండు కళ్లవంటివారని, ఒకరు పరిశ్రమలోకి పరిచయం చేస్తే, కృష్ణగారు వరుసగా సినిమా అవకాశాలు ఇచ్చారన్నారు. అలాంటి కృష్ణగారి అల్లుడితో పనిచేయడం ఆనందంగా వుందని, ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆర్టిస్టులనుండి నటనను ఎలా రాబట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి అని, ఈ క్వాలిటీని కృష్ణవంశీలో చూశానని అన్నారు. అలాగే సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతుందని, అందరికీ నచ్చేలా వుంటుందని అన్నారు.