పోర్టర్ మనోజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో మంచు మనోజ్ తాజాగా హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్ బస్‌స్టాండ్‌లో కూలీ అవతారం ఎత్తాడు. ఆయన మూటలు మోయడం చూసిన జనాలు ఒక్కసారిగా షాకయ్యారు. నిజానికి ఇదేదో షూటింగ్‌కోసమని అనుకున్నారు కానీ కాదని తెలిసింది. మూటలు మోసి, వారిచ్చిన డబ్బులు తీసుకున్నాడట మనోజ్. ఇదంతా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేముసైతం’ కార్యక్రమం కోసమని తెలుసుకొని అందరూ అభినందించారు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా సినిమా సెలబ్రిటీలను ఒకపూట పనిచేయించి, ఆ వచ్చిన డబ్బులకు అధిక మొత్తాన్ని కలిపి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగానే మంచు మనోజ్ కూలీ అవతారం ఎత్తాడు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం రవితేజ, అఖిల్, నాని, రానా, శ్రీయ, రకుల్‌ప్రీత్‌సింగ్, మంచు విష్ణు, మోహన్‌బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.