అది నా గొంతే అంటే నమ్మలేకపోయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ బ్యానర్‌పై తెరకెక్కిన ‘బిఎఫ్‌జి’ చిత్రాన్ని తెలుగులో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, యాంబ్లిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బిఎఫ్‌జి పేరుతో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఓ పాత్రకు ప్రముఖ నటుడు జగపతిబాబు డబ్బిం గ్ అందించారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏ ర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ, స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పమన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని, ఆనందంగా ఒప్పుకున్నానని అన్నారు. ఇలాంటి సినిమాకు డిఫరెంట్‌గా వాయిస్ ఇవ్వడం మ్యాజిక్‌లా అనిపించిందని, నా వాయిస్ వింటే నాకే కొత్తగా అనిపించిందని, బాలీవుడ్‌లో అమితాబ్ ఈ పాత్రకు డ బ్బింగ్ చెప్పారని, ఆయన డబ్బింగ్ చెప్పిన అలాంటి పాత్రకు డబ్బింగ్ చెప్పడం మంచి అనుభూతినిచ్చిందని అన్నారు. నా కెరీర్ మొదట్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారని, ఇప్పుడు నేనే వేరేవాళ్ళకి డబ్బింగ్ చెప్పడం కొత్తగా వుందని అన్నారు. రాంగోపాల్‌వర్మ గుర్తించేవరకూ నా వాయిస్ ఎవరికీ నచ్చలేదని, అలాగే, తాను క్లాక్స్ సినీకార్ట్ అనే వెబ్‌సైట్‌ను ఇటీవలే మొదలుపెట్టానని, రీసెంట్‌గా ఆటా కార్యక్రమం కోసం అమెరికా వెళ్లినపుడు అక్కడ కూడా వెబ్‌సైట్ లాంఛ్ చేశానని అన్నారు. అది చేసిన గంటలోనే చాలామంది నెటిజన్స్‌నుంచి రెస్పాన్స్ వచ్చిందని, ఎంతోమంది సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిచారని, ఇంత స్పందన వుంటుందని ఊహించలేదని అన్నారు. రిలయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, బిఎఫ్‌జి చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయిద్దామన్నప్పుడు మొదట జగపతిబాబే గుర్తుకువచ్చారని, ఈ పాత్రకు ఎంతో విభిన్నంగా కొత్త వేరియేషన్‌తో చెప్పారని, దాంతో ఈ పాత్రకు మంచి ప్రాముఖ్యత వచ్చిందని అన్నారు. ఈనెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.