ఎవరా రాధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని స్వంతం చేసుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ఆయన, త్వరలోనే తన తదుపరి చిత్రంలో నటించే ప్రయత్నాల్లో వున్నాడు. ప్రభాస్‌తో సినిమా చేయడానికి దర్శకుడు సుజిత్ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ‘రన్ రాజా రన్’ విజయంతో ఫాంలోకి వచ్చిన సుజిత్, ఇప్పటికే ప్రభాస్‌కు కథ చెప్పి ఒప్పించాడట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తయిన ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం కానుంది. దీంతోపాటు ఇదే బ్యానర్‌లో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకె చెప్పాడు. తాజాగా ఈ బ్యానర్ ‘రాధ ప్రేమకథ’ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇది ప్రభాస్ కోసమే అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే సుజిత్ దర్శకత్వంలో చేసే సినిమానా? లేక వేరే సినిమా? అనేది తెలియాల్సి వుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. మొత్తానికి బాహుబలి లాంటి భారీ టైటిల్‌తో ఆకట్టుకున్న ప్రభాస్, మరి ‘రాధ ప్రేమకథ’తో ప్రేక్షకుల్ని ఎలా కన్విన్స్ చేస్తాడో చూడాలి! త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.