ప్రీ ప్రొడక్షన్‌లో రానా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో భల్లాలదేవుడుగా విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న రానా దగ్గుపాటి హీరోగా, తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.
వైవిధ్యమైన కథతో తెరకెక్కే ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రానా సరసన కాజల్, కాథరీన్ ట్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో మళ్లీ తేజ తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇటీవలే ఆయన రూపొందించిన ‘హోరాహోరీ’ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని సాధించకపోవడంతో రానా సినిమాపై గట్టి ఫోకసే పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ నేతృత్వంలో పాటల సిట్టింగ్ కూడా జరగనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి చేస్తామన్నారు.