గ్యారేజ్ షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, నిత్యామీనన్, సమంత ముఖ్యపాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం టాకీ దాదాపు పూర్తిచేసుకుంది. ఇటీవలే విడదలైన ఫస్ట్‌లుక్ టీజర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. కేవలం 30 గంటల్లో 20 లక్షలకుమందికిపైగా వీక్షించారు. దాంతో ఈ సినిమాపై మరిన్ని భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లైమాక్స్‌తోపాటు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలని హైదరాబాద్, కేరళలో చిత్రీకరిస్తారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బిజినెస్ ట్రేడ్‌వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.